రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

23-11-2026 | 08:00pm

కోదాడ నవంబర్ 23,(విజయ క్రాంతి): యాసంగి సీజన్ లో(Yasangi season) రైతులు వరి పంట కాకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలని మండల వ్యవసాయ అధికారి పాలెం రజని(Agriculture Officer Palem Rajani) తెలిపారు. సోమవారం మండలంలోనీ అన్ని గ్రామాల్లో రైతులకు ఎల్‌నినో పరిస్థితులు,  ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు దొరకుంట గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ రైతులు నీరు తక్కువగా అవసరం అయ్యే పంటలు బొబ్బర్లు, పెసలు, కూరగాయలు సాగుచేయాల్సిందిగా తెలియ చేయడం జరిగింది.

దొరకుంట సర్పంచ్ పాలకి సురేష్ మాట్లాడుతూ రైతులు ఉపాధి హామీ పథకం కింద రైతులకు అందుబాటులో ఉన్నటువంటి ఫామ్ పాండ్స్, బోర్ వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ ను వినిగించుకోవాలని , వరి పంట సాగు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారీ మహేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్,  వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు