గిరిజన మినీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

27-10-2026 | 10:15pm

బాలికల గురుకులంలో 25 బ్యాక్‌లాగ్‌ సీట్లు ఖాళీ

చివ్వెంల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సూర్యాపేట(Suryapet) జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి గిరిజన మినీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆర్‌సీఓ శ్రీనివాస్ తెలిపారు. చివ్వెంల మండలంలోని బాలికల గిరిజన మినీ గురుకులంలో ఒకటో తరగతిలో 15, ఐదో తరగతిలో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని, మొత్తం 25 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించేందుకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇతర ఇంగ్లీష్‌ మీడియం బాలికల గిరిజన మినీ గురుకులాల్లోనూ ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌సీఓ సూచించారు.

మరిన్ని వార్తలు