బీజేపీ స్వచ్ఛభారత్..
ఆసుపత్రి వద్ద పారిశుధ్య పనులు
కోహెడ, అక్టోబర్ 2, (విజయక్రాంతి): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని.. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు.. కోహెడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమం(Swachh Bharat Program) నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆసుపత్రి పరిసరాలలో పెరిగిన గడ్డి, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం, నాయకులు జాలిగం రమేష్, మ్యాకాల రజినీకాంత్ రెడ్డి, పిల్లి నర్సయ్య, పెర్యాల సాగర్ రావు, మ్యాకాల చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నాగు అజయ్, బండ జగన్, గుగ్గిళ్ల శ్రీనివాస్, మామిడి కరుణాకర్, నరాల శ్రీకాంత్, కరివేద అఖిల్ రెడ్డి, ముంజ సాగర్, తలారి సుధాకర్, అన్నాడి మధుసూదన్ రెడ్డి, పాల్గొన్నారు.