పట్టభద్రుల ఓటు నమోదుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
నిరుద్యోగ భృతిపై సమాధానం చెప్పాలి
గ్రామగ్రామాన ప్రచారం చేయాలి
మోతె, అక్టోబర్ 27 (విజయక్రాంతి): వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మోతె మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు(BRS leaders Seelam Saidulu), జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం సర్వారం గ్రామంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటరు నమోదు గడువు నవంబర్ 6 కావడంతో అర్హులైన పట్టభద్రులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం గ్రామగ్రామాన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బానోతు దేవల నాయక్, మాజీ సర్పంచులు గుగులోతు శంకర్ నాయక్, బానోతు వెంకన్న నాయక్, ఉపసర్పంచ్ పల్స్ మల్సూర్, బీఆర్ఎస్ నాయకులు మిక్కిలినేని సతీష్, మధు, శ్రీధర్, మల్లికార్జున, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.