పాత పంటల్లో పౌష్టికాహారం అధికం

27-10-2026 | 08:32pm

జహీరాబాద్ అక్టోబరు 27: సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ మహిళలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని జహీరాబాద్ సివిల్ జడ్జ్ కవితా దేవి(Zahirabad Civil Judge Kavita Devi) అన్నారు. మంగళవారం నాడు జహీరాబాద్ లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు.

ఈ సమావేశంలో మహిళలకు రైతులుగా గుర్తించి ప్రభుత్వం చట్టం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జడ్జి కవితా దేవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. మహిళలు పురుషుల కంటే ఎక్కువ పని చేస్తారని ఆమె గుర్తు చేశారు.

డిడిఎస్ లో పనిచేస్తున్న మహిళలందరికీ ఇంతకు పూర్వమే నేను చెప్పిన విధంగా మీరు పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు సంపాదించిన దానిలో కొంత కుటుంబాలకు ఖర్చుపెట్టి మరికొంత పొదుపు చేసుకోవాలని సూచించానని దానిని ఎంతమంది పాటిస్తున్నారని ఆమె అడిగారు. డిడిఎస్ లో పనిచేస్తున్న మహిళలందరూ చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారని ఈ రోజుల్లో మీలాంటి వయసు గలవారు కుర్చీలకే పరిమితం అవుతున్నారని మీరు కింద చక్కగా కూర్చుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని ఆమె తెలిపారు.

పాత పంటలతో పండించిన పంటలతో మీరు ఈ విధంగా ఆరోగ్యవంతంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలకు కూడా కూలి ఇవ్వాలని ఆమె తెలిపారు జహీరాబాద్ వ్యవసాయ అధికారి డాక్టర్ వైద్యనాథ్ మాట్లాడుతూ పాత పంటల వినియోగం వల్ల ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా వివిధ రోగాలు దరి చేరవని ఆయన తెలిపారు.

తన చిన్నతనంలో మా తల్లిదండ్రులు పాత పంటలు పండించే వారిని తాము ఆ రోజుల్లో పాత పంటలను తిన్నామని ఆయన గుర్తు చేశారు. పశువుల పేడతో ఎరువును తయారుచేసి పంట పొలాల్లో వేసే వారని దాంతో అధిక దిగుబడి వచ్చేది అన్నారు.సమాజంలో మహిళల పని చాలా బ్రహ్మాండంగా ఉంటుందని వారిని గుర్తించినట్లయితే బాగుపడతాయని ఆయన పేర్కొన్నారు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల వర్షాలు తక్కువ మోతాదులో నమోదైనప్పటికీ పంటలు ఎండకుండా కాపాడగలుగుతారని ఆయన పేర్కొన్నారు.

మహిళ రైతుల గుర్తింపు వారి హక్కులు సేంద్రియ వ్యవసాయం చిరుధాన్యాల ప్రాముఖ్యతలో మహిళలు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళ రైతులుగా గుర్తింపు పొందేందుకు చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్ఫ్ అడ్వైజర్ పి జమున, డిడిఎస్ బోర్డు మెంబర్ డాక్టర్ రుక్మిణి రావు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్ మేటల్ కుంట సూర్య కళమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు