రెండో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు

12-10-2026 | 10:10pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఆలయం(Sri Vijaya Durga Temple), అన్నపూర్ణ పరమేశ్వర ఆలయాలలో  దేవీ నవరాత్రి మహోత్సవాలు(Devi Navaratri Celebrations) భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.శరన్నవ రాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.ఆలయ పూజారులు ములుగు శ్రీనివాసాచార్యులు, ఉగ్రదండి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.

నేరేడుచర్ల పట్టణంతో పాటు మండలంలోని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా,అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు