ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కుంకుమ పూజలు, అన్నదానం
భారీగా హాజరైన భక్తులు
కోదాడ అక్టోబర్ 17(విజయ క్రాంతి) : సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ మండలం నలబడగూడెం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో(Sri Sri Sri Prasanna Anjaneya Swamy Temple) దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ చైర్మన్ ముండ్రా రామారావు ఆధ్వర్యంలో శనివారం భక్తిశ్రద్ధలతో(devotional) కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అన్నదాత శ్రీ సాయి మందిరం రామాపురం క్రాస్ రోడ్డు నల్లపాటి నర్సింహారావు అన్నదానం చేశారు. సర్పంచ్ అల్సకాని భవాని శరభయ్య అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత సుబ్బారావు, రంగారావు, ఎం సీతయ్య, జి రామచంద్రయ్య, ఈదర వెంకటేశ్వర్లు, నల్లపాటి వెంకటేశ్వర్లు, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.