నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం

24-10-2026 | 05:32pm

రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి

శాస్త్రవేత్త డాక్టర్ ఆదర్శ్ 

తుంగతుర్తి( విజయక్రాంతి) : సమతుల్య సహజ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించి నేల ఆరోగ్య పరిరక్షణతోనే(Health Preservation) సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని, ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) రైతులు ఆరుతడి పంటల(Wet crops) వైపు మొగ్గు చూపాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆదర్శ్ అన్నారు,

 శనివారం మండల పరిధిలోని కొత్తగూడెం రైతువేదికలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పెంపుదల, సమతుల్య ఎరువుల వినియోగం, వాతావరణ మార్పుల(Climate change) ప్రభావాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.

 నేలలో సేంద్రియ కర్బనం శాతం పెంపొందించడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, ఉపయోగకరమైన సూక్ష్మజీవుల అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. పంట అవశేషాలను నేలలో కలపడం, పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ పదార్థాల వినియోగం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించాలని తెలిపారు.

నేల స్వభావం, పంట అవసరాలకు అనుగుణంగా ఎరువులు వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పరిరక్షించుకోవచ్చని పేర్కొన్నారు,ఎల్నిన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యాసంగిలో ఓరి సాగు చేయవద్దని ఈ పరిస్థితిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటల ద్వారా వైవిధ్యాన్ని పాటించాలని అన్నారు, వరి కోత అనంతరం పంట అవశేషాలను దహనం చేయడం మానుకోవాలని అన్నారు, వ్యవసాయ అధికారి రాయపు దేవ ప్రసాద్ మాట్లాడుతూ

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని సూచించారు. భూగర్భ జలాల తరుగుదలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, మొక్కజొన్న, మినుములు, కందులు వంటి ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నీటి సంరక్షణ భూగర్భ జలాల పునరుద్ధరణ, వర్షపు నీరు సేకరణ, నేలలో తేమను సంరక్షించే పద్ధతులు పాటిస్తూ నీటి వృథాను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, వ్యవసాయ విస్తరణ అధికారి శ్వేత, స్థానిక రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు