గాంధీజీ ఆశయాలే స్ఫూర్తి

02-10-2026 | 06:57pm

ఎఏంసి చైర్మన్ నిర్మల

కోహెడ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఘనంగా గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు పూలమాల వేశారు. ఘన నివాళి అర్పించారు. గాంధీజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గాదాసు రాజేందర్, శ్రీశైలం, మహేష్ కుమార్,  యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు