ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలి
27-11-2026 | 04:29pm
మఠంపల్లి నవంబర్ 27 (విజయక్రాంతి ): మఠంపల్లి మండలంలోని అల్లిపురం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Family Life Insurance) నమోదు కార్యక్రమాన్ని సర్పంచ్ భోగాల జ్యోతి పిచ్చిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి నమోదు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్ రెడ్డి వీరారెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు నాగేశ్వరావు పిఎసిఎస్ డైరెక్టర్ అంతోని,వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.