చెరువును తలపిస్తున్న వీధులు!
తుంగతుర్తి వార్డులలో ఏండ్లుగా తీరని సమస్యలు
పదేళ్లుగా డ్రైనేజీ, సీసీ రోడ్డుకు నిధులు కరువు
నిధులు కేటాయించి, మరమ్మతులు చేయాలని వేడుకోలు
తుంగతుర్తి, సెప్టెంబర్ 24: గడచిన పది సంవత్సరాలుగా మండల కేంద్రంలోని పలు వీధుల్లో, నూతన డ్రైనేజీలు, సిసి రోడ్లు లేకపోవడంతో చిన్న వర్షానికి, చెరువును తలపిస్తూ, ప్రజలకు అసౌకర్యంగా మారాయి. తుంగతుర్తి(Tungaturthi)లోని 2వార్డు ,4వార్డ్ తో పాటు పలు వార్డుల్లో చిన్న వర్షం వస్తే వీధులలో నీరు నిలిచి చెరువును తలపిస్తున్నాయి. 4వ వార్డులోని డ్రైనేజీ మొత్తం చెట్ల ,చెదారముతో మునిగిపోయింది. దీనితో వర్షం పడితే నీరు నిలిచిపోయి, దోమలతో, రోగాల బారిన పడుతున్నట్లు వీధివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ లేక అవస్థలు
గ్రామంలోని 2వార్డులో గడచిన పది సంవత్సరాలుగా నూతన డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, గతంలో ఉన్న సర్పంచులు, అధికారులు తెలియజేసినప్పటికీ, నేటి వరకు కూడా డ్రైనేజీ(Drainage) ఏర్పాటు చేయకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ దవాఖానకు ఆనుకొని ఉండి, చిన్న వర్షానికి నీళ్లు నిలిచి దోమలతో ఇబ్బందులు పడుతున్నామని వీధివాసులు అంటున్నారు.
ధ్వంసమైన సీసీరోడ్డు
ఈ వార్డులో గడిచిన 30 సంవత్సరాల క్రితం వేసిన సిసి రోడ్డు పూర్తిగా ధ్వంసం అ యింది. దీనితో నీళ్లు నిలుస్తున్నాయని, రెండ వ వార్డ్ మెంబర్ ఎల్లబోయిన. శ్రీకాంత్ నా యుడు ప్రత్యేకంగా డ్రైనేజీ సిసి రోడ్ నిర్మాణానికి గతంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం కూ డా అందజేశారు. నేటి వరకు సమస్య పూర్తి కాలేదని ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం దారుణమని వీధి వాసులు అంటు న్నారు. ఇక పలు చోట్ల పరిశుభ్రత సక్రమం గా లేకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మ ందుల సామేలు స్పందించి, మండల కేం ద్రంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న ౨, ౪వ వార్డులకు నిధులు కేటాయించి, డ్రైనేజీ సీసీ రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని వీధివాసులు కోరుతున్నారు.
ప్రత్యేక నిధులు కేటాయించాలి
పదేళ్లుగా ౨వ వార్డుకు డ్రైనేజీ, సీసీ రోడ్డు లేక ఇబ్బందులకు గురవుతున్నాం. పలుమా ర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లే కుండా పోయింది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి డ్రైనేజీ, సీసీ రోడ్డుకు ప్రత్యేక నిధు లు కేటాయించి ఇబ్బందులు తొలగించాలి.
- ల్లబోయిన శ్రీకాంత్,
వార్డ్ మెంబర్, తుంగతుర్తి