అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

25-09-2026 | 06:24pm

కోదాడ 19వ వార్డులో 250 మందికి కార్డుల పంపిణీ

కోదాడ సెప్టెంబర్ 25(విజయ క్రాంతి) : అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పలువురు నాయకులు పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోని(Kodad town) 19వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని(Smart Ration Card Distribution Program) శుక్రవారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కోల్లా కోటిరెడ్డి ఆధ్వర్యంలో షాప్‌ నంబర్‌ 24 వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 250 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకుల పొందేందుకు మాత్రమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు కూడా కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు(Public representatives), అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.19వ వార్డులో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ఒకేసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తమ్మనబోయిన వీరబాబు, మారెల్లి వెంకటరెడ్డి, కొనకంచి నాగేశ్వరరావు, లంకెల కుటుంబరెడ్డి, పంతంగి నారాయణ, తూములూరి సీతారామరాజు, టి. నాగేశ్వరరావు, కాంపాటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు