కోదాడ జాబ్ మేళాలో 152 మంది కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల ఎంపిక
21-09-2026 | 07:46pm
చైర్మన్ నీలా సత్యనారాయణ
కోదాడ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(Kits Womens Engineering College)కు చెందిన 152 మంది విద్యార్థినులు ప్రముఖ కంపెనీలకు ఎంపికయినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ సోమవారం తెలిపారు. ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైన ఫోక్సకాన్, ఐ - ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎల్ఎంఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బిఎంపీ వాయిస్ బేస్డ్ కంపెనీ, ఎంఆర్ఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎం పవర్, గోఫ్లై, స్టాఫింగ్ టైటాన్స్, బజాజ్, ఎస్బిఐఎన్, డాజిల్ స్పోర్ట్స్, ఎంఐవిఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ప్రముఖ కంపెనీలకు 152 మంది విద్యార్థినులు ఎంపిక కావడం అభినందనీయమని, ఎంపికైన విద్యార్థినులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు.