దేవుడు మన్యం భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
23-09-2026 | 10:08pm
-బిజెపి పట్టణ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్
హుజూర్ నగర్, సెప్టెంబర్ 23: దేవుడు మన్యం భూములు కాపాడాల్సిన బాధ్యత దేవదాయ శాఖ ప్రభుత్వంపై ఉందని బిజెపి పట్టణ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్(BJP Town President Konda Harish Goud) అన్నారు. బుధవారం పట్టణంలోని పనిగిరి గుట్ట సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములను స్థానిక కౌలు రైతులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
నాలుగు తరాల నుండి దేవుడు మాన్యం భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకుల కుటుంబాలవారికి దేవాలయ భూములపై హక్కులు కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగు తరాల నుండి సాగు చేసుకుంటున్న చిన్న సన్న కారు రైతులకు అండగా బిజెపి పార్టీ ఉంటుందన్నారు.