రిటైర్డ్ హెడ్మాస్టర్ సతీమణి మృతికి నివాళులు

11-10-2026 | 09:57pm

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 11: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కొణతం కృష్ణారెడ్డి సతీమణి కొణతం సరోజనమ్మ(Krishna Reddy's wife, Konatham Sarojamma) ఇటీవల మరణించారు.ఆదివారం జరిగిన ఆమె దశదిన ఖర్మ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారి కుమారులైన తిమ్మాపురం పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొణతం స్టాలిన్ రెడ్డి,కొణతం కర్ణాకర్ రెడ్డి లను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.నివాళులర్పించిన వారిలో గ్రామసర్పంచ్ బొడ్డు ఇందిరాసోమరాజు,కోమటిపల్లి గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి యాదవ్,తిమ్మాపురం గ్రామ ఉప సర్పంచ్ దేశిడి సందీప్ రెడ్డి,మాజీ ఎస్ఎంసీ చైర్మన్ తండా లింగమూర్తి గౌడ్,నాయకులు బొడ్డు బిక్షం,చెర్కుపల్లి ప్రవీణ్,గుడిపెల్లి కృష్ణారెడ్డి,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు