వడ్ల కొనుగోలు కేంద్రం కోసం రిలే నిరాహార దీక్ష

27-09-2026 | 04:46pm

శ్రీరంగాపూర్, సెప్టెంబర్ 27: వనపర్తి జిల్లా(Wanaparthy District) శ్రీరంగాపూర్ మండలం మండలం తాటిపాముల గ్రామంలోని ఊరగట్టు వద్ద ఉన్న అసైన్డ్‌ భూమిని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంగా(Paddy procurement center) కేటాయించాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ పార్వతమ్మ వెంకటయ్య నాయుడు(Former MPTC Parvathamma Venkatayya Naidu) ఆధ్వర్యంలో రైతులు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో ఈ స్థలంలో గ్రామ రైతులు ధాన్యాన్ని పోసుకొని కాంటా నిర్వహించి, కింటాల్‌ చొప్పున కొనుగోలు చేసి బయటకు తరలించేవారని తెలిపారు.

ప్రస్తుతం ఆ స్థలాన్ని ఆర్‌బీఆర్‌ క్రషర్‌ యాజమాన్యం స్వాధీనం చేసుకోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు స్థలాన్ని పరిశీలించి, తాటిపాముల గ్రామానికి వడ్ల కొనుగోలు కేంద్రంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ ముంత శిరీష మధు, ఉపసర్పంచ్‌ గంధం కురుమన్న, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు