2 July, 2026 | 12:26 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

Districts - Wanaparthy

article_43620154.webp
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు

వీపనగండ్ల: మండల కేంద్రంలోని పూరి గుడిసెలలో నివసిస్తున్న ఏడు మంది నిరుపేద కుటుంబాలను తహసిల్దార్ ఖాజా మైనుద్దీన్ గ్రామ సర్పంచ్ మీసాల పర్వతమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత ఇంటి కలను సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పారదర్శకంగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పరిస్థితిని స్వయంగా పరిశీలించి వారి వివరాలను నమోదు చేశారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నియబంధన ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి కావలి మహేష్ వార్డు సభ్యులు సుబ్రహ్మణ్యం చారి గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

30-06-2026

article_81790777.webp
పెబ్బేరు వద్ద బస్సు ప్రమాదం

వనపర్తి, (విజయక్రాంతి)/పెబ్బేరు/అలంపూర్: వనపర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్ మంత్రాలయం నుండి కర్నూల్ మీదుగా వనపర్తి కి వస్తున్న క్రమంలో పెబ్బేరు జాతీయ రహదారి( Pebbair National Highway) 44 పై అదుపుతప్పి బోల్తా పడటంతో 11 మంది ప్రయాణికులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా బస్సులో మొత్తం 61 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగే సరికి ప్రయాణికులు భయబ్రాంతులకు గురి అయ్యారు. విషమ పరిస్థితి ఉన్న ఒక్కరిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్వల్ప గాయలైన వారిని గద్వాల, వనపర్తి, పెబ్బేరు ఆసుపత్రి లో వైద్యం అందిస్తున్నారు.

29-06-2026