లెంకాలపల్లి తాత్కాలిక సర్పంచ్‌గా బాధ్యతల స్వీకరణ

27-10-2026 | 03:58pm

నల్లబెల్లి, అక్టోబరు 27 ( విజయ క్రాంతి): మండల పరిధిలోని లెంకాలపల్లి గ్రామ పంచాయతీ తాత్కాలిక సర్పంచ్‌గా ఉప సర్పంచ్ కొలిపాక రఘుపతి(Deputy Sarpanch Kolipaka Raghupathi) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి రవీందర్ మరణించడంతో ఖాళీ ఏర్పడిన స్థానంలో, మండల పరిషత్ అధికారి(Mandal Parishad Officer) (ఎంపీఓ) పసరగొండ రవి సమక్షంలో ఆయనకు తాత్కాలిక సర్పంచ్‌గా బాధ్యతలు అప్పగించారు.

అలాగే గ్రామ పంచాయతీ రెండో సంతకదారుగా సింగిరెడ్డి రవిని వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రఘుపతి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి గాదం రవి, మాజీ అధ్యక్షుడు మామిళ్ళ పోషాలు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నత్తి లింగయ్య, నూటెంకి మొగిలి. వార్డు సభ్యులు కందికొండ కృష్ణ, నానబోయిన రజిత స్వామి, గాదం లలిత కుమారస్వామి, గాదం రాజమ్మ రమేష్‌. గ్రామ నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు