హాలోవీన్‌లో ఇండియన్ దెయ్యం
ఇండియన్ ఇన్వేషన్కు అస్సలు హద్దుల్లేవ్ బాస్! చివరకు అమెరికాలో జరిగే హాలోవీన్ వేడుకలను (Halloween Celebrations) కూడా మనోళ్లు వదల్లేదు. వెస్ట్రన్ హారర్ క్యారెక్టర్ల మధ్యలో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ’ (Stree) గెటప్‌లో ఓ మహిళ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా హాలోవీన్ అంటే దెయ్యాలు, రాక్షసులు, జాంబీలు.. ఇలా రకరకాల భయంకరమైన వేషధారణలు కనిపిస్తుంటాయి. అయితే ఈసారి అమెరికాలోని హాలోవీన్ పార్టీలో మన దేశీ దెయ్యం ‘స్త్రీ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ సినిమాలోని పాత్రను గుర్తుచేసేలా మహిళ కనిపించడంతో అక్కడివారి దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో స్పందిస్తున్నారు. వెస్ట్రన్ హాలోవీన్లోకి మన దేశీ దెయ్యం కూడా వచ్చేసిందని కామెంట్లు చేస్తున్నారు. 'ఇండియన్ ఇన్వేషన్ ఈజ్ నౌ 100 పర్సెంట్ కంప్లీట్' అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మొత్తానికి భారతీయ సినిమా పాత్రల క్రేజ్ (Indian Cinema Craze) దేశ సరిహద్దులు దాటి అమెరికా హాలోవీన్ వేడుకల్లోనూ కనిపించడంతో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది