సింధు హాస్పిటల్స్‌లో బియాండ్‌ఏ1సీ సేవలు

24-10-2026 | 05:00am

మధుమేహ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఎంవోయూ

భారత్‌లో తొలిసారిగా పరీక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సాయి సింధు ఫౌండేషన్(Sai Sindhu Foundation) ఆధ్వర్యంలోని సింధు హాస్పిటల్స్, మెడికామెట్రిక్స్ ఇంక్ సంస్థకు చెందిన బియాండ్‌ఏ1సీ విభాగంతో అవగాహన ఒప్పందం(MOU) కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింధు హాస్పిటల్స్‌లో బియాండ్‌ఏ1సీ పరీక్షలను ప్రారంభించారు. భారత్‌లో ఈ పరీక్షలను తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మధుమేహ సంబంధిత సమస్యలను ముందస్తుగా పెద్ద ఎత్తున గుర్తించేందుకు షెఫీల్డ్ వన్‌ధె పరీక్షను ప్రధాన స్క్రీనింగ్ విధానంగా వినియోగించనున్నారు.

క్రమం తప్పకుండా నిర్వహించే బియాండ్‌ఏ1సీ పరీక్షలు మధుమేహం, డయాలసిస్, కీమోథెరపీ చికిత్సలు పొందుతున్న రోగులకు ఉపయోగకరంగా ఉండటం తోపాటు ఒక ఆదర్శంగా మారే అవకాశం ఉంది. కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత ఈ పరికరం మూడు ప్రధాన వైద్య అవసరాలు షెఫీ ల్డ్ వన్ బియాండ్‌ఏ౧సీ అంకో, బియాండ్‌ఏ1సీ డయాలసిస్‌కు అనుగుణంగా పరీక్షలను అందిస్తుంది.

ఈ పరీక్షలకు పేటెంట్ పొందిన డీపీఎన్ చెక్ పరికరం ఆధారం. ఇది చికిత్స అందించే ప్రదేశంలోనే నరాల సంకేత ప్రసరణను వేగంగా, కచ్చితంగా, నిష్పాక్షిక్షంగా పరీక్షించేందుకు ఉపయోగపడుతుంది. షెఫీల్‌డ వన్ సేవను యూ కేలోని షెఫీల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ అభివృద్ధి చేసి ధృవీకరించాయి. ఈ వి నూత్న పరికరాన్ని ప్రస్తుతం యూకే ఎన్‌హెచ్‌ఎస్ వ్యవస్థలో వినియోగంలోకి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.

మెడికామెట్రిక్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాబర్ట్ రుడేలియస్ మాట్లాడుతూ ‘భారత్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సింధు హాస్పిటల్స్ సరైన వేదిక. ఇక్కడి వైద్య నిపుణులు, పరిశోధన పట్ల సంస్థకున్న నిబద్ధత ద్వారా మధుమేహం, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ముందస్తు పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలను అందించవచ్చు’ అని అన్నారు. సింధు హాస్పిటల్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, మెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి.సోమరాజు మాట్లాడుతూ మధుమేహన్ని గుర్తించడం సాధారణ వైద్య సంరక్షణలో భాగం కావాలి.

అంకాలజీ, డ యాలసిస్ సహా మా వివిధ విభాగాల్లో బియాండ్‌ఏ౧సీ పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తాం’ అని పేర్కొన్నారు. సింధు హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఎండో క్రైనాలజిస్ట్ డాక్టర్ స్మితా నల్లా మాట్లాడుతూ ‘సూక్ష్మ రక్తనాళాల సమస్యలున్న అనేక మంది రోగుల్లో లక్షణాలు కనిపించవు. అందుకే రోగి ఉన్న ప్రదేశంలోనే స్క్రీనింగ్ నిర్వహించడం ఎంతో ముఖ్యం. ప్రమాదం ఉన్న ప్రతి రోగికి పరీక్షలు చేస్తే మరింత ముందుగా చర్యలు తీసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు