రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే...

06-11-2026 | 07:07pm

మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి...

యాదగిరిగుట్ట, నవంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారని రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి(Former Whip Gongidi Sunitha Mahender Reddy), మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో మాజీ వార్డు మెంబర్ యెడపల్లి వెంకటేష్, మండల బిఆర్ఎస్వి సెక్రెటరీ జనరల్ యెడపల్లి రఘువరన్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు.

మరిన్ని వార్తలు