ముగిసిన గణేశుడి నిమజ్జన శోభాయాత్ర
23-09-2026 | 03:11pm
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు(alair) పట్టణంలోని శివాలయంలో ప్రతిష్ఠించిన గణేశుడి నిమజ్జన(Ganesha immersion) శోభాయాత్రను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శివాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ పురవీధుల మీదుగా ఉత్సాహంగా సాగింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నృత్యాలు, భజనలతో సందడి చేశారు. అనంతరం గణేశుడి విగ్రహాన్ని గంధమల్ల చెరువుకు తరలించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, భక్తులు సహకరించారు. ఈ కార్యక్రమంలో పాశికంటి సంతోష్, పాశికంటి వజ్రయ్య, చింతకింది రామానుజం, పులగం భాస్కర్, బొద్దుల రమేష్, పిస్కె ఉపేందర్, చిమ్మి ఆనంద్, పోతుగంటి సంపత్ కుమార్, వుల్లోజు చారి, శివాలయం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.