వర్షాల దృష్ట్యా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు

23-09-2026 | 02:50pm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, ఐఏఎస్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23, (విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు , ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్(Collector Mr. Ankit), జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంఈఓ లు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత ఆర్ సి ఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అన్ని ప్రభుత్వ, ప్రైవేట్  రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మరిన్ని వార్తలు