రోషిని కుషాల్ జైస్వాల్‌కు ఘన స్వాగతం..

27-09-2026 | 04:44pm

ఆలేరు, సెప్టెంబర్ 27: మిస్ ఇండియా గ్లామర్ అవార్డు గ్రహీత, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రోషిని కుషాల్ జైస్వాల్‌(Roshni Kushal Jaiswal)కు ఘన స్వాగతం లభించింది. వరంగల్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరై హైదరాబాద్‌కు వెళ్తున్న ఆమెకు స్థానిక పిస్తా హౌజ్ హోటల్ వద్ద కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ముచ్చాల మనోజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులను రోషిని కుషాల్ జైస్వాల్ దృష్టికి తీసుకెళ్లారు. గత 40 ఏళ్ల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్డెంకి ప్రమోద్, మహేందర్, సాదిక్, సాయి, ఆశిష్, శివ, గౌరీ, శివ ప్రసాద్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు