జనసంద్రంగా యాదగిరి క్షేత్రం..

27-09-2026 | 07:55pm

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రా(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple)నికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది. ధర్మ దర్శనానికి రెండు గంటలు స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. ధర్మ దర్శనం, స్పెషల్ దర్శన  క్యూ లైన్లు, ప్రసాద విక్రయశాల క్యూ కాంప్లెక్స్ లలో భక్తులు బారులు తీరారు.

స్వామివారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. అనుబంధ ఆలయం శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో శివుడికి పండితులు  అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.

మరిన్ని వార్తలు