'మహాకోటి దీపోత్సవం' పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్..
ఆదిలాబాద్, నవంబర్ 23, (విజయక్రాంతి): కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టే మహాకోటి దీపోత్సవము' కార్యక్రమానికి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) అన్నారు. స్థానిక మార్వాడి ధర్మశాలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో నిర్వహించనున్న 'మహాకోటి దీపోత్సవము' ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు కందుల రవిందర్, రేణికుంట రవిందర్, సంతోష్ అగ్రవాల్, పిల్లి మహిపాల్, శశికళ చౌహాన్, భార్గవి, ఇతర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.