పేద కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ బీమా

23-11-2026 | 06:19pm

రాజాపూర్ నవంబర్ 23: పేద కుటుంబాల జీవితాలకు భరోసాను ఇచ్చే ఇందిరమ్మ జీవిత బీమాను(Indiramma Life Insurance) ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్ అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియం చేసుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ చందర్, పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, సి నర్సింలు, నరేష్, కృష్ణ,ఆంజనేయులు, వీరేష్,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు