టెండర్ రద్దు చేయాలని ఎమ్మెల్యే లేఖ రాయడం సరైంది కాదు

23-11-2026 | 06:10pm

అధికారులు టెండర్ రద్దు చేయాలనే ఆలోచన విరమించుకోవాలి

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

కొత్తగూడెం, నవంబర్ 23 (విజయక్రాంతి): ఇటీవల నిర్వహించిన నాక్ బిల్డింగ్ టెండర్ రద్దు చేయాలని ఎమ్మెల్యే లేఖ రాయడం సరైంది కాదని,టెండర్ రద్దు చేయాలనే ఆలోచనను అధికారులు విరమించుకోవాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (Jai Bheem Rao Bharat Party) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.

సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంలో నాక్ బిల్డింగ్ కోసం మొట్టమొదటిసారి ఆర్ అండ్ బి వాళ్ళు టెండర్లు ఆహ్వానిస్తే, ఆ టెండర్లలో ఏడుగురు మాత్రమే పాల్గొన్నారని, చుంచుపల్లి మండలంలో పెడతామని మళ్లీ టెండర్ పిలిచారని అప్పుడు ముగ్గురు మాత్రమే టెండర్ లో పాల్గొన్నారని, టెండర్ విలువ రూ 7.48 కోట్లు ఉంటే,ఆ టెండర్ ను ఎన్.హెచ్.ఆర్.ఇన్ఫ్రా వారు 13.29%శాతానికి తక్కువ కు కోడ్ చేశారని,ఇలా కోడ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి సుమారు కోటి రూపాయలు ఆదా జరిగిందని, గత నెల 27న టెక్నికల్ బిడ్ ను ఓపెన్ చేశారన్నారు.

ఈ టెండర్ ను ఈ నెల 4వ తేదీన ఓపెన్ చేశారని పేర్కొన్నారు. బీటి ప్లాంట్ ఉన్నవాళ్లకే టెండర్ రావాలని కొత్త నిబంధనలను పెట్టి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు టెండర్ ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే తహతహలాడరాని ఆరోపించారు. ఈనెల 4వ తేదీన టెండర్ ఓపెన్ చేయడమే తడవుగా టెండర్ రద్దు కోరుతూ ఎమ్మెల్యే తన లెటర్ హెడ్ ద్వారా సంబంధిత అధికారులకు 5వ తేదీన లేఖ రాయడం మంచి సాంప్రదాయం కాదని విమర్శించారు.

అధికారులు సైతం తప్పుడు విధానాలు అవలంబిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. టెక్నికల్ బిడ్,ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ప్రాతిపదికన టెండర్ రద్దు చేయడానికి వెళ్తారని ప్రశ్నించారు? చట్ట ప్రకారం టెండర్ ప్రక్రియ జరగకపోతే అధికారులనైనా సరే న్యాయస్థానాలకు లాగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, ధనుంజయ్, రాజ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు