డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మోతె జయకృష్ణ
23-11-2026 | 06:21pm
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మోతె జయకృష్ణ(Mothe Jayakrishna) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. జయకృష్ణ ఎన్నికపై డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొలస సత్యనారాయణతో పాటు జిల్లా నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.