యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

23-11-2026 | 06:17pm

జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్‌రెడ్డి

చివ్వెంల, నవంబర్ 23 (విజయక్రాంతి): యాసంగి 2026–27 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగు తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్‌రెడ్డి(District Agriculture Officer G. Sridhar Reddy) సూచించారు. సోమవారం చివ్వెంల మండలం ఐలాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందులు, పెసలు, మినుములు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కుసుమ, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పంటల మార్పిడితో నీటి వినియోగం, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుందని వివరించారు. నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్‌ను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు