భూముల పరిరక్షణకు ప్రజావాణిలో ఫిర్యాదు
గచ్చిబౌలిలో లెదర్ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలి
MRPS డిమాండ్
జుక్కల్, నవంబర్ 23 (విజయక్రాంతి): గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(TGLIPC)కు కేటాయించిన భూములను పరిరక్షించాలని, ఇతర ప్రాజెక్టులకు భూముల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని MRPS నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జుక్కల్ MPDO శ్రీనివాస్ కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మాదిగ, మోచి వర్గాల ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించిన భూములను సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించాలని కోరారు. గచ్చిబౌలిలో లెదర్ ఇండస్ట్రియల్ హబ్(Industrial Hub), కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి సంప్రదాయ చర్మకారులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.