సమస్యలు పరిష్కారం కానప్పుడు సమావేశాలు ఎందుకు

06-11-2026 | 06:41pm

తాంసి/భీంపూర్,నవంబర్ 6(విజయక్రాంతి): గ్రామాలలో విద్యుత్ సమస్యలు(Electricity issues) ఉన్నాయని ఇప్పటి వరకు మూడు సమావేశాలలో పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు(Electricity Department officials) చెప్పిన పట్టించుకోవడం లేదని,సర్పంచులు గుర్ల పుష్పలత నారాయణ,కాల్చప్ యాదవ్,కామన్వర్ అశోక్,రాకేష్ లు ఏఈ తిరుపతి రెడ్డి నీ నిలదీశారు..సమస్యలు పరిష్కారం కానప్పుడు సమావేశాలు ఎందుకు అని అధికారులను ప్రశ్నించారు. గ్రామాలలో సమావేశాలు జరిగిన సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని సర్పంచ్ కాల్చప్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు..

భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి గోపి కిషన్, ఎంపీడీవో గడ్డం గోపాల కృష్ణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం  మండల సర్వ సభ్య సమావేశం  నిర్వహించారు...వివిధ శాఖల అధికారులు ఎజెండాలో పొందుపరిచిన అంశాలను చదవి వినిపించారు..ఒకప్పుడు జాతీయ అవార్డు పొందిన భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు వైద్య సిబ్బంది లేక వైద్యం కుంటుపడుతుందని,గర్భిణులకు స్కానింగ్ సదుపాయం లేదని,భీంపూర్ సర్పంచ్ రంజన రవీందర్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు..

వడూర్ పెన్ గంగా నదిలో ఇసుక అక్రమ దందా నడుస్తుందని,ఒక టోకెన్ తీసుకొని ఆ రోజంతా ఇసుకను మోస్తున్నారని,భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని,అక్రమ ఇసుక రవాణాను ఆపాలని వడూర్ సర్పంచ్ దత్తు తహసిల్దార్ దృష్టికి తీసుకొని వచ్చారు..నీటిని పొదుపుగా వాడాలని,ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని,ప్రత్యేక అధికారి గోపి కిషన్, ఎంపీడీవో గడ్డం గోపాల రెడ్డి సూచించారు..

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ నాయక్,మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డి,ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ,మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి,ఆర్డబ్లూఎస్ ఏఈ చంద్రశేఖర్,ఆరోగ్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ముంతాజ్, ఏఈ తిరుపతి రెడ్డి,వివిధ శాఖల అధికారులు, సర్పంచులు,కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు