మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం

06-11-2026 | 07:42pm

నాబార్డ్ డీడీఎం రవీందర్

తుంగతుర్తి, (విజయక్రాంతి): మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం "లక్ష్యం స్వచ్ఛంద సంస్థ" లక్ష్యమని నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ రవీందర్(NABARD DDM Ravinder) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లక్ష్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో 15 రోజులపాటు నిర్వహించిన చైల్డ్ కేర్ గారియాట్రిక్ కేర్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని శిక్షణ తీసుకున్న 35 మంది మహిళలకు ఎంపీడీవో చలపతి, స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.

చిల్డ్రన్స్ కేర్, వృద్ధాప్య కేర్ కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ ఇచ్చి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది మహిళలకు ఇంద్రాణి సర్వీసెస్ ఆధ్వర్యంలో నెలకు రూ.20వేల వేతనంతో ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్యం ఎన్జీవో చైర్మన్ శంకర్, సెక్రెటరీ లత, ట్రెజరర్ అభినయ్, వెలుగు సీసీ రమేష్, ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్ వైష్ణవి, మధు, ఇంద్రాణి సర్వీసెస్ హరీష్, లక్ష్యం ఎన్జీవో కోఆర్డినేటర్ ఆకాష్, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు