డీజే నిర్వాహకునిపై కేసు నమోదు

09-09-2026 | 12:01am

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా టెస్టింగ్ పేరుతో అధిక శబ్దం వచ్చే విధంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన డీజే యాజమాని ఇర్షద్ అలీ పైన కేసు నమోదు చేసి డీజే ను వాడిన వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి(Adilabad DSP Jeevan Reddy) తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరు వ్యవహరించిన కేసులు తప్ప వన్నారు. డీజే యజమాను నిబంధనలకు లోబడి మాత్రమే సౌండ్ సిస్టం వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో  సీఐ గురు స్వామి ఎస్ఐ.వి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు