సబ్సిడీపై సెనగ విత్తనాలు సిద్ధం
19-10-2026 | 05:47pm
బోథ్. అక్టోబర్ 19 (విజయక్రాంతి): మండలంలో రబీ కింద సాగు చేసే శనగ విత్తనాల(Chickpea Seeds)ను సిద్ధంగా ఉంచామని సహకార సంఘం సీఈవో బారే నాగభూషణ్ పేర్కొన్నారు. సహకార సంఘాలలో 25 కిలోల బస్తా జేజి 11, జాకి, రక విత్తనాలు అందుబాటులో ఉన్న అన్నారు. బస్తా ఒక్కంటికి 2175 రూపాయలు చెల్లించి తీసుకోవాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.