5 September, 2026 | 12:31 PM

Breaking News

ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలి: జాన్సన్ నాయక్   •   భూభారతి అవకతవకలపై మహాదీక్షకు తరలిన బీజేపీ నాయకులు   •   పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పత్తాలేని అధికారులు   •   బూరుగుపల్లిలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ   •   వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన   •   ఎస్‌జేకేఎం కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం   •   విద్యాశాఖలో అనేక మార్పులు తెస్తున్నాం   •   నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న మమ్మల్ని పందికొక్కులుగా ప్రస్తావిస్తారా..!   •   బేకరీల్లో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు   •   కోట కె గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్... 47ద్విచక్ర వాహనాలు స్వాధీనం   •  

కోట కె గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్... 47ద్విచక్ర వాహనాలు స్వాధీనం

05-09-2026 | 11:52am

బోథ్‌, సెప్టెంబర్‌ 5 (విజయ క్రాంతి): సోనాల మండలంలోని కోట (కె) గ్రామంలో శనివారం ఉదయం 5 గంటల నుంచి సీఐ గురుస్వామి(CI Guruswamy) ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 100 మంది పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా, 47 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక మ్యాక్స్‌ వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీఐ గురుస్వామి(CI Guruswamy) మాట్లాడుతూ.. 174 ఈ-చలాన్‌ కేసుల్లో రూ.41,315 వసూలు చేయడం జరిగిందన్నారు. అంతేగాక నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. గుడుంబా, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో బోథ్‌ ఎస్‌ఐ వి. పురుషోత్తం, బజార్‌హత్నూర్‌ ఎస్‌ఐ రమేష్‌, పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు