5 September, 2026 | 1:16 PM

బూరుగుపల్లిలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పంపిణీ

05-09-2026 | 12:19pm

గజ్వేల్, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు బూరుగుపల్లి(Boorugupalli) గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు’(Congress Baaki Card) కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు చెలిమేటి రాజు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అబ్దుల్, సీనియర్ నాయకులు కిషోర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ  రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అశోక్ రెడ్డి, కరుణాకర్, స్వామి, ప్రవీణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, రజినీకాంత్, కిరణ్, సాయిలు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు