కాలువ నిర్మాణ భూములకు ఎకరానికి రూ.40 లక్షల పరిహారం
29-10-2026 | 03:11pm
బేల అక్టోబర్ 29(విజయక్రాంతి): మండలంలోని భేధొడ గ్రామ పరిధిలో కాలువ నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్న నేపథ్యంలో, ప్రభావిత రైతులు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎకరానికి నిర్ణయించిన రూ.18 లక్షల పరిహారాన్ని పునఃపరిశీలించి, భూముల మార్కెట్ విలువ, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ఎకరానికి కనీసం రూ.40 లక్షల పరిహారం అందించాలని బెల తహసీల్దారకు వినతిపత్రం సమర్పించారు. కాలువ నిర్మాణంతో వ్యవసాయ భూములు రెండు భాగాలుగా విడిపోయి సాగుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.