నిర్మల్ కేంద్రంగా రైల్వే లైన్ నిర్మాణం సాధిస్తా
నిర్మల్ అక్టోబర్ 29 ( విజయక్రాంతి): నిర్మల్ ప్రాంత ప్రజలకు మూడు దశాబ్దలకల అయిన ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం జరిగే వరకు కృషి చేస్తామని నిర్మల్ రైల్వే సాధన కమిటీ అధ్యక్షులు(President of the Nirmal Railway Development Committee) నంగి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ నిర్మల్ కేంద్రంగా నిర్మిస్తే ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభాహు వ్యక్తం ఇస్తారు.
ఎన్నోసార్లు ఢిల్లీ హైదరాబాదులో రైల్వే అధికారులు కలిసి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఎట్టకేలకు సర్వే నిర్వహిస్తుందని తెలిపారు. నిర్మల్ ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతం పారిత్రానికంగా వ్యవసాయ రకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
నిర్మల్ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే లైన్ నిర్మాణం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేకసార్లు దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో ఈ సమావేశాన్ని అధికారుల దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం తక్కువ బడ్జెట్ తో నిర్మల్ అడెల్లి ధన్నూర్, కౌటా సోనాల పాదరత్నూర్ మీదుగా అదిలాబాద్ రైల్వే లైన్ లింక్ కు కొత్త లైన్ ప్రతిపాదన డిపిఆర్ సర్వే పూర్తి అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మాణం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే లైన్ నిర్మాణం చేపట్టే వరకు రైల్వే లైన్ నిర్మాణం సాధన సమితి నిరంతరంగా కృషి చేస్తుందని ప్రజలు కూడా తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.