వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసు ఛేదన

29-10-2026 | 03:38pm

ముగ్గురు నిందితుల అరెస్టు.. బంగారు ఆభరణాల స్వాధీనం

అశ్వాపురం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మండలంలోని సీతారామపురంలో(Sitaramapuram) వృద్ధురాలి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు(Arrest) చేశారు. సెప్టెంబర్‌లో బొల్లు సరోజినమ్మ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసుతో పాటు రూ.50 వేల నగదు అపహరించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం గొల్లగూడెం క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సీతారామపురంతో పాటు చుంచుపల్లి పరిధిలోనూ చోరీ చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులను రేవు సురేష్, గొంది ముత్తయ్య, సల్బం చిన్నాగా గుర్తించారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని మణుగూరు కోర్టులో హాజరుపరిచినట్లు అశ్వాపురం సీఐ వెల్లడించారు.

మరిన్ని వార్తలు