బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి

25-10-2026 | 03:22pm

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్

తాంసి/భీంపూర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి(Congress leader Srinivas Reddy) ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు..ఆయన వెంట మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్,మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు (అడ్వకేట్) కేమ శ్రీకాంత్, తదితరులు ఉన్నారు..

మరిన్ని వార్తలు