ఏకగ్రీవంగా రెడ్డి గాండ్ల సంఘం నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా అయిత కరుణాకర్ రెడ్డి
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెడ్డి గాండ్ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా అయిత కరుణాకర్ రెడ్డి(Aitha Karunakar Reddy), ప్రధాన కార్యదర్శిగా కామిడి సుధాకర్ రెడ్డి, కోశాధికారిగా చల్ల తిరుపతి రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా గద్దె పోచిరెడ్డి ఎన్నికయ్యారు.
అదేవిధంగా ముఖ్య సలహాదారులుగా బండం సరోత్తం రెడ్డి, రత్న శివారెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి, ఎనగంటి శంకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బండం లక్ష్మారెడ్డి, ప్రచార కార్యదర్శిగా పోటు సత్యనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సంఘంలోని ప్రతి సభ్యున్ని కకుపుకొని ముందుకు సాగుతూ, కుల బాంధవుల ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.