ముదిరాజుల కులదైవం పండుగ సాయన్న విగ్రహం ప్రతిష్ఠ
గండీడ్, నవంబర్ 1 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ముదిరాజుల కులదైవమైన శ్రీశ్రీశ్రీ పండుగ సాయన్న(Panduga Sayanna) (రాబిన్హుడ్) విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన దిమ్మెపై ప్రతిష్ఠించారు. అయితే విగ్రహ ఆవిష్కరణ తేదీ ఇంకా ఖరారు కాలేదని ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గండీడ్ మండలంలోని అన్ని కులాల పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తమ సహాయ సహకారాలు అందించాలని మండల ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. ప్రస్తుతం విగ్రహాన్ని దిమ్మెపై ప్రతిష్ఠించడం మాత్రమే జరిగిందని, అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం ఇంకా నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొమిరె లక్ష్మయ్య, స్థానిక ఉప సర్పంచ్ చెన్నయ్య,ర్యాకం కేశవులు, చెవుల చంద్రయ్య, చెవుల వెంకటయ్య,జి.అంజిలయ్య, బి.నర్సప్ప,బి.అంజి, జి.వెంకటయ్య,ర్యాకం భీమయ్య,బోర్ కృష్ణ, తమ్మలి మల్లయ్య,తమ్మలి రాములు, తిరుపతయ్య, యువకులు,తదితరులు పాల్గొన్నారు.