సేవా గుణంలో సాటిలేని వ్యక్తి.. ప్రదీప్ కుమార్

01-11-2026 | 10:32pm

* సీనియర్ న్యాయవాది జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

* న్యాయసేవతో పాటు సామాజిక సేవలోనూ ప్రత్యేక గుర్తింపు

మోతె, నవంబర్ 1 (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ.. న్యాయసేవతో పాటు సామాజిక సేవలోనూ తనదైన గుర్తింపు పొందిన సీనియర్ న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్(Senior Advocate Podila Pradeep Kumar) జన్మదిన వేడుకలు ఆదివారం మోతె మండలంలోని రాఘవపురం ఎక్స్‌రోడ్డుతో పాటు పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అన్నా అని పిలిస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రదీప్ కుమార్ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని స్నేహితులు కొనియాడారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సైతం తనవంతు సహాయం అందిస్తూ, గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ న్యాయ, సామాజిక సేవలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మూడు  కృష్ణ, శ్రీలక్ష్మి ప్రసన్న ఎలక్ట్రికల్ బొర్రాజు మల్లయ్య, సామ ప్రభాకర్ రెడ్డి, బత్తిని కనకయ్య, మండవ రాము, గుండాల సైదులు, పజ్జురి ప్రవీణ్, బత్తిని శ్రీకాంత్, బత్తిని క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు