ప్రజల ఓటు హక్కును కాపాడేందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం
మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్..
జవహర్ నగర్ నుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు
జవహర్ నగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాడుతున్నామని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా(Reddy Shetti Srinivas Gupta) పేర్కొన్నారు.దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్ శనివారం కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించిన భారీ ధర్నాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొనగా, తెలంగాణ నుంచి జవహర్ నగర్ మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డిశెట్టి శ్రీనివాస్ క్రియాశీలకంగా పాల్గొని తన గళాన్ని వినిపించారు.
ఓట్ చోర్ - గద్దీ చోర్ నినాదాలతో హోరెత్తిన మైదానం..
జవహర్ నగర్ నుంచి భారీగా తరలివెళ్లిన నేతలు...
ఈ నిరసన కార్యక్రమంలో జవహర్ నగర్ నుంచి మాజీ కార్పొరేటర్లు బల్లి శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కుతాడి సాయి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గజ్వేల్ శంకర్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.
భారీ సంఖ్యలో నాయకులు, ప్రజలు తరలిరావడం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని, ప్రజల ఓటు హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.