మృత్యుకుహరంగా మల్కారం క్వారీ

01-11-2026 | 10:37pm

ఘటన మరువక ముందే మరో విషాదం...

ప్రమాదవశాత్తు క్వారీలో పడి ఇద్దరు మృతి..

జవహర్ నగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్(Jawahar Nagar) ఠాణా పరిధిలోని సర్వేనెంబర్ 12 P లో గల క్వారీలో ఆదివారం ఉదయము 6:30 గంటలకు పిక్నిక్ కోసమని వెళ్లిన ఐదుగురు మిత్రులు ఆహారం వండుకొని తిన్న తర్వాత పాత్రలను కడుక్కోవడం కోసం నీటిలోకి సరదాగా ఆడుకుంటున్న క్రమంలో  ఇద్దరు మిత్రులు ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం యాప్రాల్ ప్రాంతానికి చెందిన అక్షిత్ (19), మురారి (19), పియూష్ (18), సయాన్ (18), రోహిత్ (18) అనే  ఐదుగురు మిత్రులు పిక్నిక్ కని వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారన్నారు. గల్లంతైన వారికి ఈత రాకపోవడం ఒకరికి ఈత వచ్చినా కాలుకు గాయమవడంతో కాపాడలేక 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారన్నారు.

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్ డి ఆర్ ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది, 108 సిబ్బందితో పాటు స్థానికుల  సహకారంతో మృతదేహాలను వెలికి తీశారు. కాగా మృతులను సయాన్ (18) రోహిత్ (18) లుగా గుర్తించామని, సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు