ఇంద్రవెల్లి రాజ్ గోండ్ సేవా సమితిలో నూతన కమిటీ!
ఉట్నూర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్ గోండ్ సేవా సమితి(Gond Seva Samiti) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు(MP Soyam Bapu Rao)ను ఇంద్రవెల్లి మండల నూతన అధ్యక్షుడు పెందూర్ గణేష్, ఉపాధ్యక్షుడు ఆత్రం నితీష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సోయం బాపూరావు నివాసంలో ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెందూర్ గణేష్, ఆత్రం నితీష్లను సోయం బాపూరావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గేడం రమేష్, ప్రసార కార్యదర్శి తొడసం శ్రీను, విద్యార్థి సంఘం నాయకులు చకటి విలాస్, కినక నాగనాథ్, పెందూర్ బాలాజీ రాజు, పెందూర్ జైవంత్ రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు