గుర్రాలగొందిలో ధాన్యం కొనుగోళ్లు షురూ!

30-10-2026 | 12:28pm

సిద్దిపేట రూరల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): గుర్రాలగొంది గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర (Minimum Support Price) పొందాలని సూచించారు. కొనుగోళ్లు పారదర్శకంగా (Transparent Procurement) జరిగేలా గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రం, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఐకేపీ సిబ్బంది, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు