TRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు

30-10-2026 | 09:39am

ఇంద్రవెల్లిలో పాంచజన్య శంఖారావం.. కవిత ఏం ప్రకటించబోతున్నారు? 

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక అడుగు వేశారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున రెండో అభ్యర్థిని కూడా ప్రకటించారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆకాశ్ కొల్లూరును Candidateగా ఖరారు చేశారు. ఇప్పటికే వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానం నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును ప్రకటించిన కవిత.. రెండో స్థానంలోనూ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికే అవకాశం కల్పించారు. దీంతో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులను బరిలోకి దించినట్లయింది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్

ఆకాశ్ కొల్లూరు ఎంపికతో తెలంగాణ రక్షణ సేన ఎన్నికల కార్యాచరణ మరింత వేగం అందుకోనుంది. జాతీయ మీడియా సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, CNN-News18 వంటి సంస్థల్లో బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక Campaign నిర్వహించేందుకు కవిత వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి Election Observer, Coordinator బాధ్యతలను డాక్టర్ చిట్నేని రఘుకు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమాల సమన్వయం, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.

ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ.. భారీ ఏర్పాట్లు

మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వెనుక ఉన్న మైదానంలో ఈ Public Meeting జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చేలా Organising Team ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాలు, మండలాల వారీగా జనసమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది.

సభలో పార్టీ విధాన ప్రకటనపై ఆసక్తి

ఈ సభలో తెలంగాణ రక్షణ సేన భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీ విధానాలను కవిత ప్రకటించనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం వంటి అంశాలపై పార్టీ వైఖరిని ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతమైన ఇంద్రవెల్లి వేదికగా నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలాన్ని పెంచుకోవడంపై కవిత ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు జిల్లాల స్థాయిలో పార్టీ నిర్మాణం, బహిరంగ సభల నిర్వహణ.. ఇలా తెలంగాణ రక్షణ సేన వరుస కార్యక్రమాలతో రాజకీయంగా యాక్టివ్ అవుతోంది. ఇంద్రవెల్లి సభలో కవిత చేసే ప్రకటనలు, పార్టీ విధానాలపై ఇచ్చే స్పష్టతపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ సభతో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి ఎలాంటి Political Momentum వస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు