మార్కెట్ ఆదాయం పెంపుకు కృషి చేయండి

02-10-2026 | 08:27pm

బోథ్ అక్టోబర్ 2( విజయక్రాంతి): మార్కెట్ కమిటీ ఆదాయం పెరిగే విధంగా కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Committee Chairman Mallepula Satyanarayana) సూచించారు. శుక్రవారం సరిహద్దుల్లో ఉన్న ఘన్పూర్ చెక్పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన పంట చెక్పోస్ట్ మీదుగా వెళితే తప్పనిసరిగా మార్కెట్ ఫీజు చెల్లించే విధంగా చూడాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి చెక్ పోస్ట్ మీదుగా పసుపు, నూనె గింజలు, మిరప, తో పాటు దాన్యం రవాణా జరుగుతుందని పేర్కొన్నారు. అయితే పటిష్టమైన నిగా ఉంచాలని మార్కెట్ ఫీజు చెల్లించే విధంగా చూడాలన్నారు. అక్రమ వ్యాపారం జరిగితే చర్యలు తప్పక అన్నారు.

మరిన్ని వార్తలు